సనత్ నగర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
డివిజన్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి వెనువెంటనే చర్యలు తీసుకుంటామని సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి అన్నారు. ఎస్సార్టీ కాలనీ నుంచి జై భారతి స్కూల్ చౌరస్తా వరకు రూ. 47 లక్షల వ్యయంతో వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఆమె ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు.