స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ ప్రాంతం శరణుఘోషతో మార్మోగింది. పవిత్ర కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని వందలాది మంది భక్తులు అయ్యప్ప దీక్ష చేపట్టారు. సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలోని అయ్యప్ప దేవాలయం వేదికగా జరిగిన దీక్షాధారణ కార్యక్రమంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సంద్రంలో మునిగితేలాయి. అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అరుణ్ గురుస్వామి దాదాపు 500 మంది భక్తులకు శనివారం మాలాధారణ చేశారు.