తాము చదువుకున్న కాలేజీపైనే విద్యార్థులు పంజాగుట్ట పీఎస్ లో మంగళవారం పిర్యాదు చేశారు. అమీర్ పేట్ లోని అమ్రీట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలకు ఏ యునివర్శిటీతో అనుబంధం లేకున్నా నడిపిస్తున్నారని వాపోయారు. విద్యార్థులను చేర్చుకుని సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని దీంతో విద్యార్థులు ఎబివిపి నాయకులతో కలిసి పీఎస్ లో పిర్యాదు చేశారు. కళాశాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.