గతంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి పార్ములా-ఈ రేస్ తెస్తే రేవంత్ రెడ్డి ఇంటర్ నేషనల్ షేమ్ తెచ్చారని మాజీమంత్రి, ఎమ్మేల్యే కేటీఆర్ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్ లో అయన సమావేశం నిర్వహించారు. ప్రపంచంలో మన ఇజ్జత్ తీసిండు. పది మందిలో మన పరువు తీసిండు. అంటూ సీఎం పై కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రముఖ కంపెనీలు సైతం తెలంగాణలో ఈ రేస్ క్యాన్సిల్ కావడం సిగ్గుచేటు అని విమర్షించారని పేర్కొన్నారు.