రాజేంద్రనగర్ మండల కేంద్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత్ రావు, టీపీయూఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాశీరావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాజేంద్రనగర్ మండల తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల ఆర్థిక విషయాలు, 4 డీఏలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.