చంపాపేట డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గాభవానీనగర్ కాలనీలో 50 లక్షల నిధులతో ప్రారంభించిన సీసీరోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. కాలనీల్లో పనులు జరిగేటప్పుడు స్థానికులకు కాస్త ఇబ్బందులు తలెత్తుతాయని సంయమనం పాటించి అభివృద్ధికి సహకరించాలన్నారు.