ఇసుక లారీలు ఉచితంగా పార్కింగ్ చేసుకునేలా కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల వినతి మేరకు శుక్రవారం ఇసుక అడ్డా వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గతంలో జాతీయ రహదారి పక్కన ఇసుక లారీల అడ్డా ఉండేదని, సమీప కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆటోనగర్ లోని సువిశాల స్థలంలో ఉచితంగా పార్కింగ్ కు నాటి మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.