ఎల్బీనగర్: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఆదివారం ఆడపడుచులు, పిల్లలు అందంగా ముస్తాబయ్యి బతుకమ్మ పాటలకి ఉత్సహంగా ఆడిపాడారు. గ్రామప్రజలు, కాలనీ వాసులు ఊరేగింపుగా వెళ్లి, చెరువు, కుంటలలో, నీటి వనరులలో గౌరమ్మని నిమజ్జనం చేశారు. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ ఘనంగా బతుకమ్మకి వీడ్కోల్ పలికారు.