గోల్కొండ నుంచి సెవెన్ టుంబ్స్ వరకు రోప్ వే
గోల్కొండ నుంచి సెవెన్ టుంబ్స్ వరకు రోప్ వే ఏర్పాటు కోసం అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. సెవెన్ టుంబ్స్ నుండి గోల్కొండ పోర్ట్ వరకు ప్రతిపాదిత ఓవర్ హెడ్ స్కై కేబుల్ ప్రాజెక్టును బుధవారం పరిశీలించారు. అతి త్వరలో ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి స్కై కేబుల్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ కో-కార్పొరేటర్ అమీర్ పాల్గొన్నారు.