బాగ్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ బుధవారం సందర్శించారు. చెరువు ఆక్రమణపై స్థానికులతో మాట్లాడారు. తమ ఇళ్లు కూల్చేస్తారా అంటూ స్థానికులు కమిషనర్‌ను ప్రశ్నించగా ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే బతుకమ్మకుంటను రెండు నెలల్లో పునరుద్దరిస్తామని పేర్కొన్నారు.