ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ద్వారా బహిరంగ చెత్తను క్లియర్ చేస్తామని కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ తెలిపారు. గురువారం డివిజన్ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను, భవన నిర్మాణ వ్యర్థాలను క్లియర్ చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన చోట శానిటైజ్ కూడా చేస్తామన్నారు