బతుకమ్మ పండుగ కోసం డివిజన్ పరిధిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. బుధవారం అధికారులతో డివిజన్ పరిధిలోని బతుకమ్మ ఘాట్ లను పరిశీలించారు. తాత్కాలిక విధి దీపాలతో పాటు శానిటేషన్ పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కార్పొరేటర్ సూచించారు.