ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం సేకరణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి. ఎస్. చౌహన్ సూచనలు చేశారు.