అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస జాతర ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో రావడంతో దర్శనానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పురాతన ఆలయం అనంత పద్మనాభస్వామి కార్తీకమాస జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. జాతర ఉత్సవాలకు భక్తులు భారీగా తరలిరావడంతో ఉచిత దర్శనానికి 2 గంటల సమయం క్యూ లైన్ లో వేచి ఉన్నారు.