మొయినాబాద్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో విద్యార్థులు, అధ్యాపకుల సదుపాయాల కోసం ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదు. దేశంలోని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సోషల్ వెల్ఫేర్ కోడింగ్ స్కూల్ ని నిర్లక్ష్యం చేసి మూసి వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.