TG: రాష్ట్ర ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవాళ రాత్రి నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఏయే జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.