TG: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదవపెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చెప్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాంటిదేమీ లేదని మరో మంత్రి ప్రకటనలు ఇస్తున్నారని వెల్లడించారు. యూనివర్సిటీ భూములు కుదువ పెట్టారా? అమ్మారా? దోచుకున్నారా? అనే విషయంపై స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.