చివరి దశకు చేరుకున్న ప్రణయ్‌ హత్య కేసు విచారణ

54பார்த்தது
చివరి దశకు చేరుకున్న ప్రణయ్‌ హత్య కేసు విచారణ
TG: 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసు తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఘటనలో ప్రణయ్‌ను హత్య చేశారు. యువతి తండ్రి మారుతీరావు సహా మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఈ నెల 10న అదనపు సెషన్స్‌ కోర్టు తుది తీర్పు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణ జరుగుతున్నప్పుడే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, తుదితీర్పుపై ప్రణయ్‌ కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

தொடர்புடைய செய்தி