పెద్దపల్లి: బాలల సంరక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్
పెద్దపల్లి మండలం రాఘవపూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో సోమవారం చైల్డ్ హెల్ప్ లైన్- 1098 ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేర్ వర్కర్ కల్పన బాలల రక్షణ, సంరక్షణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిరోధం, బాలకార్మికుల హక్కుల పరిరక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మైనర్ ప్రేమ వివాహాలు, మొబైల్ వాడకంపై వివరించారు. అవగాహన పోస్టర్లు విడుదల చేశారు.