జగిత్యాల: మహిళా సమాఖ్య భవనానికి భూమి కేటాయించి నిధులు మంజూరు చేయండి
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఆదివారం ఉదయం జగిత్యాల అర్బన్ మండలం అక్షర మహిళ సమాఖ్య సభ్యులు కలిశారు. జగిత్యాల అర్బన్ మండల అక్షర మహిళా సమాఖ్య కు (సెర్ఫ్/ ఐకెపికి) భవనం లేనందున ఇబ్బందిగా ఉందన్నారు. అర్బన్ మండల మహిళా సమాఖ్య కు భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయగలరని వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.