ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఆదివారం ఉదయం జగిత్యాల అర్బన్ మండలం అక్షర మహిళ సమాఖ్య సభ్యులు కలిశారు. జగిత్యాల అర్బన్ మండల అక్షర మహిళా సమాఖ్య కు (సెర్ఫ్/ ఐకెపికి) భవనం లేనందున ఇబ్బందిగా ఉందన్నారు. అర్బన్ మండల మహిళా సమాఖ్య కు భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయగలరని వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.