తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంలోకి తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ మాటలు విని తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ పదవికి పవన్ అనర్హుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కోర్టులో కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను మోదీ, చంద్రబాబు, పవన్ కాపాడాలని డిమాండ్ చేశారు.