AP: తిరుమలలో అన్యమతానికి సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ చేసిన ఇద్దరు మహిళలపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుపతి ఓటేరుకు చెందిన శంకరమ్మ, మీనాక్షి పాపవినాశం వద్ద ఇతర మతానికి చెందిన పాటలతో రీల్స్ చేశారు. అది గమనించిన స్థానికులు విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో తిరుమల పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.