తన పేరు వాడుకొని లంచాలు ఆశించిన అధికారి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సదరు అధికారిపై చర్యలకు ఆదేశించామని అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'అధికారి నా పేరుతో లంచాలు ఆశిస్తున్నాడనే విషయాన్ని ప్రజలు మా డిప్యూటీ సీఎం పేషీకి తీసుకొచ్చారు. ఆ అధికారిపై చర్యలు తీసుకొని, తప్పు చేశాడని తేలితే సస్పెండ్ చేయాలని ఆదేశించాను. మా ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనే దానికి ఈ సంఘటనే నిదర్శనం' అని అన్నారు.