తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మరో ప్రకటన చేసింది. ఆరోగ్యశ్రీ ఇంఛార్జ్ సీఈవోగా మరోసారి ఐఏఎస్ అధికారి కర్ణన్ నియమిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ విభాగంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో సర్కార్ సీఈవో శివ శంకర్‌ని జీఏడీకి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీకి కొత్త ఇంఛార్జ్ సీఈవోని నియమించింది.