AP: కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడటం మరోసారి కలకలం సృష్టించింది. 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న నాలుగు లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసినట్లు సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గోదాముకు తరలించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.