ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. మైనర్ బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వృద్ధుడి ఇంటికి వెళ్లి.. చెప్పులు, కర్రలతో తీవ్రంగా కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.