నాగిరెడ్డిపేట్ మండలం మాసానిపల్లి గండి చెరువు శిఖం భూమిని కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేయగా, సమాచారం అందుకున్న ఆర్ఐ మంగళవారం గండిచెరువు శిఖం భూమి కబ్జాను అడ్డుకొని అక్కడ పనులు చేస్తున్న జేసీబీని తీసుకెళ్లారు. భూమికి సంబంధించిన పట్టాలు ఉన్నాయని గ్రామస్తులు తెలుపగా, పట్టా కాగితాలు తీసుకొని తాసిల్దార్ కార్యాలయానికి రావాలని కోరారు. గండి చెరువు శిఖం భూమిని సర్వే చేస్తామని తహశీల్ధార్ శ్రీనివాస్ తెలిపారు.