నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా రచయితల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు ప్రేమ్ లాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రచయితల కోసం, కవుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేముల శేఖర్, రాజేందర్ పాల్గొన్నారు.