నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లూ మినహాయించబడకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి జాగ్రత్తతో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ఉన్నారు.