నిజామాబాద్: నగరంలోని ఐదో డివిజన్ బోర్గాం (పి) శ్రీ సాయిలక్ష్మీ నగర్ లో ‘ఓపెన్ జిమ్’ ను కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌజన్య రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ మంజూరు చేసిన రూ. 4 లక్షల నిధులతో జిమ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా మరో రూ. 4 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశామన్నారు.