రైతు భరోసా ఎగ్గొట్టారని నిరసిస్తూ ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను బి ఆర్ ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన రైతుబంధు, రైతు భరోసా హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. పంటలు కోతకు వచ్చినా గాని పంటకు రైతు భరోసా ఇవ్వక పోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.