నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ లో శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ దుర్గామాత అమ్మవారి సన్నిధిని అయోధ్య రామ మందిరం రూపంలో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవి నవరాత్రుల సందర్భంగా ఈ ప్రాంతాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తున్నారు.