రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అధునాతన హంగులతో అందుబాటులోకి రానున్నాయని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలు, శిక్షణా తరగతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు.