ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ సూచించారు. సోమవారం నిజాంసాగర్ పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది పని తీరు గురించి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలను తెలసుకొని, రికార్డులను పరిశీలించారు.