పేదల సంక్షేమంలో కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు వెంకటేష్ అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ 5వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు, కర్షకుల పట్ల కొత్త చట్టాలను తీసుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.