వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం బీసీ హాస్టల్ లో పేరెంట్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏబిసిడిఓ నర్సయ్య, ఏబిసిడిఓ గంగాధర్ హాజరైయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పిల్లలు వ్యక్తిగతంగా శుభ్రత పాటించాలని, స్కిన్ కు సంబంధించిన ఏ వ్యాధులు రావని పిల్లల తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని పిల్లల దుస్తులను శుభ్రం ఉంచుకోవడం వలన పిల్లలకు గజ్జి తామర వంటి వ్యాధులు రావని సూచించారు.