శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం నిండడంతో ఇన్ఫ్లో లక్షకు పైగా ఉండడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ అధికారులు ఆదివారం 24 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో వరద ఉధృతి వలన లక్ష ఇరవై ఆరు వేల ఇన్ఫ్లో రావడం పూర్తిస్థాయి నీటిమట్టం నిండి ఉండడంతో సుమారు లక్ష ఇరవై ఆరువేల అవుట్ ఫ్లో ఉండే విధంగా ప్రాజెక్టు అధికారులు 24 గేట్లను ఎత్తి దిగువ భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు.