రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ కాడి చెరువు పూర్తిగా నిండి ఆదివారం అలుగు పారుతుంది. చెరువులో నుండి భారీగా వరద నీరు పంట పొలాల్లోకి రావడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు కట్టి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.