రచయితల సంక్షేమం కోసం కృషి చేయాలని సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు ప్రేమ్ లాల్ కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రచయితల కోసం, కవుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటులో రచయితల స్థానం ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేముల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.