ఏడపల్లి సొసైటీ ఆధ్వర్యంలోసోమవారం తానాకలాన్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కారెడ్డి హాజరయ్యారు. రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, కార్యదర్శి రాజారాం, సిద్దిరామేశ్వర్ సంఘ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.