ఆర్మూర్: శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో నందిపేట మండలం ఉమ్మెడ శివాలయం శిఖరం ఆకట్టుకుంటోంది. ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండడంతో ఆలయం శిఖరం వరకు మునిగింది. దుర్గా శరన్నవరాత్రులు ముగియడంతో వివిధ గ్రామాల ప్రజలు గంగాస్థానానికి వెళ్లి స్నానమాచరించారు. నీటిలో తేలిన ఆలయ శిఖరాలను శనివారం భక్తులు దర్శించుకుంటున్నారు.