బాసర మండల కేంద్రంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసించే మహిళ ఆత్మహత్య చేసుకుందామని వెళ్లింది. మహిళ కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి డయల్ 100 చేయగా స్పందించిన బాసర పోలీసులు వెళ్లి ఆ మహిళను కాపాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు.