ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ భైంసా మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ పి. ప్రవీణ్ కు తపస్ బృందం వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు జి. రాజేశ్వర్, నాయకులు విఠల్ రెడ్డి, ఆర్. రాజేశ్వర్, పండరి, తదితరులు పాల్గొన్నారు.