బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ టీం, కౌన్సిలింగ్, స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ ప్రొ. గోవర్ధన్ మాట్లాడుతూ మనోధైర్యంతోనే మనోవికాసం జరుగుతుందని, అధైర్యపడితే అపజయాలు ఆహ్వానిస్తాయన్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్తే విజయ సాధించవచ్చని సూచించారు.