నిర్లక్ష్యంగా రోడ్డుపై ధాన్యం ఆరబోసి ప్రమాదానికి కారకుడైన లోకేశ్వరం మండలం సేవాలాల్ తండాకు చెందిన టీకారంపై కేసు నమోదు చేసినట్లు గురువారం ఎస్ఐ అశోక్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం రాయపూర్ కు చెందిన వెంకటేష్ తన భార్య విట్టబాయితో కలిసి బైక్ వెళుతుండగా రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పల పక్కన పెట్టిన బండరాళ్లు కనిపించక ఢీకొని పడడంతో గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.