కుంటాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏఎస్పీ

63பார்த்தது
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. గురువారం కుంటాల పోలీస్ స్టేషను సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు అందించారు. నేరాలు జరగకుండా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. భైంసా గ్రామీణ సీఐ నైలు, ఎస్ఐ భాస్కరచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி