గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలు

69பார்த்தது
ఎగువన కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1, 140 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 358. 60 మీటర్లుగా ఉందని తెలిపారు. వరద ప్రవాహం తగ్గినందున అన్ని గేట్లు మూసి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி