భైంసా మండలంలోని మాటేగాం గ్రామ సమీపంలోని గుజరాత్ నుంచి విజయవాడకు టైల్స్ లోడ్ తో వెళ్తున్న లారీ శనివారం భైంసా-నిర్మల్ జాతీయ రహదారిపై వంతెనను ఢీకొని బోల్తా పడింది. వంతెన మధ్యలో బోల్తాపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బాసర, ముథోల్ వైపు వెళ్లే వాహనాలను కుంటాల మండలంలో ఆర్లి (ఎక్స్) రోడ్డు ఉంచి, భైంసాకు వచ్చే వాహనాలను మాటేగాం నుంచి చింతలబోరి, మహాగం మీదుగా భైంసాకు వేళ్లేందుకు పోలీసులు దారి మళ్లించారు.