ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు. ఆయనతో నాయకులు, అధికారులు, తదితరులు ఉన్నారు.